తాజాగా టాలీవుడ్ డిజాస్టర్స్ ఏవి ? వాటి కలెక్షన్ వివరాలు

ఈ మధ్య భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని మూవీస్ డిజాస్టర్స్ గా నిలిచి పెట్టిన పెట్టుబడి కూడా వసూలు చేయలేకపోయాయి.మరి ఆ మూవీస్ ఏంటో వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అరణ్య : బాలీవుడ్ లో రానా కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.అలాంటి రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్య మూవీ బాక్స్ ఆఫీస్ బోల్తా పడింది.ఈ మూవీ పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది.ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 3.34 కోట్లను,రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.52 కోట్లను,ఓవర్ సిస్ లో 0.24 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఈ మూవీ పెట్టుబడి మొత్తంలో కేవలం 32 శాతం మాత్రమే రికవర్ చేసింది.

రంగ్ దే : నితిన్,కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే మొదటి రోజునే ఏవరేజ్ టాక్ మూట గట్టుకుంది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 13.90 కోట్లను,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.78 కోట్లను,ఓవర్ సిస్ లో 1.83 కోట్లను సంపాదించిన తన పెట్టుబడిని రాబాటలేకపోయుంది.ఈ పెట్టుబడి మొత్తంలో 87శాతం రికవర్ చేసింది.

వైల్డ్ డాగ్ : అక్కినేని నాగార్జున,సైయామి ఖేర్,దియా మిర్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మంచి టాక్ నే తెచ్చుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ ను రాబట్టాలేకపోయింది.ఈ మూవీ పెట్టుబడి మొత్తంలో కేవలం 40 శాతాన్ని మాత్రమే రికవర్ చేసింది.ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలో 3.08 కోట్లు,రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.15 కోట్లు,ఓవర్ సిస్ లో 0.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది