Home Sports SRH vs DC సూపర్ ఓవర్ ముఖ్యాంశాలు; ఐపీఎల్ 2021 స్కోరు, ఫలితాలు

SRH vs DC సూపర్ ఓవర్ ముఖ్యాంశాలు; ఐపీఎల్ 2021 స్కోరు, ఫలితాలు

0
51
srh vs dc
srh vs dc

ప్రతి ఐపిఎల్ లో అండర్ రేటెడ్ టీమ్ గా బరిలోకి దిగే సన్ రైజర్స్ ఐపిఎల్ ముగిసేసరికి టాప్ 4 లో ఒక టీమ్ గా నిలుస్తుంది.అలాంటి సన్ రైజర్స్ ఈ ఏడాది ఐపిఎల్ లో మాత్రం ఆరంభం నుండి తడబడుతూ తప్పులు మీద తప్పులు చేస్తూ మ్యాచ్ లు ఓడిపోతుంది.తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 20 ఓవర్ లలో 159 పరుగులు చేసింది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కింద మీద పడి 20 ఓవర్ లు పూర్తి అయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.దీంతో సీజన్ మొదటి సూపర్ ఓవర్ జరిగింది.దీంట్లో బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ కేవలం ఏడు పరుగులు చేయగా దాన్ని చేధించి సూపర్ సండే విజేతగా ఢిల్లీ నిలచింది.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కీలక సమయాలలో మూడు ముఖ్యమైన సునాయసమైన క్యాచ్ లు వదిలేయడంతో మ్యాచ్ ను ఓడిపోయింది.ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఓడిపోయిన సన్ రైజర్స్ ఈ సీజన్ చివరి రెండు,మూడు స్థానాలలో నిలుస్తుందేమో అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here